ఓట్స్ తో ఇడ్లి..
- April 09, 2021రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు.గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్.దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది.ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం..
కావలసిన పదార్ధాలు:
రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్ – 1 కప్పు
చిలికిన పెరుగు కావాల్సినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
మినప్పప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఆవాలు – 1 / 2 టీ స్పూన్
ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది)
పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి)
అల్లం ముక్క – 1 (తరిగినది)
క్యారెట్ – 1 (తురిమినది)
కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
ఉప్పు రుచికి సరిపడా
నీరు
తయారీ విధానం:
ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి. ఇంతలో గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించేయాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు చూసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇడ్లి స్టాండ్ లో ఆ పిండి ని ఇడ్లి లా వేసుకుని గ్యాస్ స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అయితే ఈ ఇడ్లిని విజిల్ లేకుండా ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ.. నచ్చిన చెట్నీతో తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు