ఎయిమ్స్‌లో కరోనా కలకలం..
- April 09, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఇక, ఢిల్లీలోని ప్రముఖు ఆస్పత్రులను కరోనా వెంటాడుతోంది... ఎయిమ్స్ ఆస్పత్రిలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. గంగా రామ్ ఆసుపత్రిలోనూ 37 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది.. వీరంతా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులని, తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని చెబుతున్నారు.. ప్రస్తుతం 32 మంది వైద్యులు హోమ్ ఐసొలేషన్‌లో ఉండగా, ఐదుగురు ఆసుపత్రిలో చేరినట్టు వైద్యులు వెల్లడించారు.. కరోనా బారినపడినవారులో వైద్యులతో పాటు.. మరికొందరు సిబ్బంది కూడా ఉన్నారు.. ఇక, తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డిఎస్ రానాతో సమీక్షించారు.. కాగా, ఎయిమ్స్ మరియు సర్ గంగా రామ్ హాస్పిటల్ రెండూ దాదాపు ఒక సంవత్సరం పాటు మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక, ఢిల్లీలో రోజువారి కేసుల సంఖ్య తొలిసారి 7 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్







