కోవిడ్ వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్...

- April 09, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్‌ వేసుకుంటే ఉచితంగా బీర్...

గుర్గావ్‌: భారత్ లో ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు కరోనా ‌వ్యాక్సినేషన్‌ జోరుగా కొనసాగుతోంది.కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్‌ వేయడం వేగవంతం చేసింది. ఇక వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రభుత్వం కోరుతుండగా, ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని ఇతర సంస్థలు సైతం కోరుతున్నాయి. అందుకు పలు రకాలుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అంతేకాదు.. వ్యాక్సిన్‌ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

ఇందులో భాగంగా హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఒక రెస్టారెంట్‌ తాజాగా మందుబాబులకు అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కరోనా టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్‌ పట్టుకెళ్లండి అని ప్రకటించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కార్డు చూపించినట్లయితే బీర్‌ అందజేస్తామని స్పష్టం చేసింది. ఇంకేముంది రెస్టారెంటు వద్ద భారీగా క్యూ పెరిగింది. ఏప్రిల్‌ 5వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్‌ ఈవారం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో గుర్గావ్‌ గోల్డ్‌ రోడ్‌లోని ఇండియన్‌ గ్రిల్‌ రూమ్‌ రెస్టారెంట్‌కు మధ్య ప్రియుల తాకిడి భారీగా పెరిగింది.

ఏది ఎలా ఉన్నా.. మందుబాబులు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించేందుకు వారికి మద్యాన్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించడం చాలా మంది ఆశ్యర్యపోతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొన్ని రోజుల వరకు మద్యం తాగవద్దని నిపుణులు సూచిస్తుండగా, ఇక్కడ మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వారికి బీర్‌ అందజేయడం మందుబాబుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com