అలీబాబాకు భారీ జరిమానా
- April 10, 2021
బీజింగ్: చైనా e-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు ఆ దేశ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గుత్తాధిపత్య వ్యతిరేక చర్యల్లో భాగంగా ఆ సంస్థపై 2.8 బిలియన్ డాలర్లు (రూ.20.500 కోట్లు) జరిమానా విధించింది. మార్కెట్లో ఏకచత్రాదిపత్యం కోసం నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ ఎజెన్సీలు తెలిపాయి.అలీబాబా గ్రూపు ఇతర సంస్థల నుంచి తనకు పోటీ లేకుండా చేసుకునేందుకు అనేక వ్యూహాల రచిస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేషన్ ఆరోపించింది. ఈ జరిమానా విలువ 2019లో కంపెనీ జరిపిన మొత్తం విక్రయాల్లో 4 శాతానికి సమానం కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ 24వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై ఆధారాలు లేని కొన్ని విమర్శలు చేశారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2,77,000 కోట్లు) ఐపిఒను నిలిపివేసిన చైనా ప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్‌లో ట్రాఫిక్ మార్పులు: ఐదవ రింగ్ రోడ్డుపై 14 రోజుల పాటు లేన్లు మూసివేత
- NTPCలో 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్‌డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్‌లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!









