దుబాయ్: భారతీయుడిపై ప్రశంసలజల్లు..

- April 12, 2021 , by Maagulf
దుబాయ్: భారతీయుడిపై ప్రశంసలజల్లు..

దుబాయ్: భారత్‌కు చెందిన ఓ యువకుడు తన నిజాయితీతో అందిరి మనసు గెలుచుకుని, ప్రశంసలు అందుకుంటున్నాడు.వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన సాజిద్ ఆలం దుబాయిలోని  సూపర్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా ప్యాకేజింగ్ స్టాఫ్ గా పని చేస్తున్నాడు.తాజాగా ఆ సూపర్ మార్కెట్‌ను సందర్శించిన చైనా వాసి అయిన లి వాన్ ఫు, దుబాయ్‌లోని అల్ వార్కాలోని లులు హైపర్‌మార్కెట్ పార్కింగ్ స్థలంలో షాపింగ్  కార్ట్‌లో దాదాపు 31,000 దిర్హాములు విలువైన డబ్బు, కాగితాలు గల బ్యాగ్‌ను మర్చిపోయి వెళ్లిపోయాడు.ఆ బ్యాగ్‌ను గుర్తించిన సాజిద్ ఆలం.. తన పై అధికారుల సహాయంతో దాన్ని భద్రపరిచాడు.అంతేకాకుండా బ్యాగ్ కోసం తిరిగొచ్చిన సదరు చైనా యువకుడికి దాన్ని అందించాడు.ఈ క్రమంలో.. విషయాన్ని వివరిస్తూ సాజిద్ ఆలం పైఅధికారులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం అదికాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. సాజిద్ ఆలంపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. 

లులు హైపర్‌మార్కెట్ రీజినల్ డైరెక్టర్ తంబన్ పొడువాల్ మాట్లాడుతూ... "లులు గ్రూప్ యొక్క కార్పొరేట్ సంస్కృతిలో భాగమైన నిజాయితీ, నిబద్ధత మరియు అంకితభావాన్ని లులు ఉద్యోగి చూపించడం ఇది మొదటిసారి కాదు. మేము చాలా గర్వంగా మరియు సంతోషంగా ఉన్నాము సాజిద్ ఆలం యొక్క గొప్ప పనికి తగినట్లుగా గుర్తించి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com