బంగ్లాదేశ్‌లో కరోనా విజృంభణ..
- April 12, 2021
బంగ్లాదేశ్: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలుదేశాల్లో ఈ మహమ్మారితోపాటు పలు కొత్త రకం కరోనా కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమానాల రాకపోకలను నిషేధించనున్నట్లు బంగ్లాదేశ్ పౌర విమానయాన సంస్థ పేర్కొంది. దేశంలో కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 20వ తేదీ వరకు అన్ని అంతర్జాతీయ, దేశీయ, స్థానిక, శిక్షణ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆదివారం ప్రకటించింది.
అయితే.. సహాయ, పునరావాస, కార్గో, సాంకేతిక కారణాలు, ఇంధనం నింపుకునేందుకు మాత్రమే విమానాల ల్యాండింగ్‌కు తమ దేశంలో అనుమతిస్తామని బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ వెల్లడించింది. కాగా.. ప్రత్యేక విమానాల్లో బంగ్లాదేశ్ వచ్చిన ప్రయాణికులు వారి సొంత ఖర్చులతో హోటళ్లలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, కరోనా నిబంధనలన్నీ యథావిధిగా పాటించాలని విమానయాన శాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే.. బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ప్రత్యేక విమానాల్లో శానిటైజ్ చేయాలని, భౌతిక దూరం పాటించాలని, కరోనా రిపోర్టులు ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









