జైలు నుంచే BD100,000 మనీ లాండరింగ్
- April 14, 2021
బహ్రెయిన్: ఓ వ్యక్తి ఏకంగా జైలు నుంచే మనీ లాండరింగ్ కు స్కెచ్ గీశాడు. అనుకున్నట్లుగానే కొంత మొత్తాన్ని విదేశాలకు తరించాడు. లావాదేవీలపై అనుమానం వచ్చిన అధికారులు విచారణ జరపటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బహ్రెయిన్ జైలులో ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ మరో ఇద్దరితో కలిసి విదేశాలకు అక్రమంగా నగదు బదిలీ చేసినట్లు తేలింది. మనీ లాండరింగ్ పై అనుమానాలు రాకుండా ఖైదీకి చెందిన ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పేరును వాడుకున్నారు. ఈ ముగ్గురు కలిసి BD100,000 వరకు అక్రమంగా విదేశాలకు తరించారు. ఈ ముగ్గురు వ్యభిచార ముఠాను కూడా నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఇందులో ఒకరు వ్యభిచార ముఠా కేసులో ఐదేళ్ల జైలు శిక్షను కూడా అనుభవిస్తున్నాడు. ఈ లాండరింగ్ కేసులోనూ అతనే ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పేరుతో 2017 నుంచే మనీ లాండరింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







