'ఆరాట్టు' టీజర్: తెలుగు డైలాగ్ తో అదరగొట్టిన మలయాళ స్టార్...
- April 14, 2021
మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆరాట్టు'. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కేవలం 53 సెకన్ల నిడివి ఉన్న వోల్టేజ్ మాస్ కంటెంట్ టీజర్ తో హీరోను పరిచయం చేశారు. అయితే ఈ టీజర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉండగా... అది కూడా తెలుగు డైలాగ్ కావడం విశేషం. టీజర్లో 'నేను వాడిని చంపేస్తాను' అంటూ విలన్ ను హెచ్చరించారు మోహన్ లాల్. దీంతో సినిమాలో తెలుగు నేపథ్యం కలిగిన విలన్ పాత్ర ఉండి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'ఆరాట్టు' చిత్రానికి బి ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. మీరు కూడా ఈ పైసా వసూల్ టీజర్ ను వీక్షించండి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







