విదేశీ టీకాలకు అనుమతి ఇవ్వనున్న భారత్...!
- April 14, 2021
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో... వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారత్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో... వ్యాక్సినేషన్ కొరతను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలను దేశంలో అనుమతి ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అత్యవసర వినియోగానికి వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సమాయాత్తం అవుతోంది. దేశంలో ఇప్పటికే మూడు టీకాలు అనుమతులు పొందాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో భారత్‌లో మరికొద్ది రోజుల్లోనే కొత్త టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అమెరికా, బ్రిటన్, రష్యా, జపాన్ వంటిదేశాల్లో తయారైన కరోనా టీకాలకు పలు దేశాల్లో ఇప్పటికే ఆమోదం పొందాయి. ఇలా ఆమోదం లభించిన టీకాలను భారత్‌లో అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చేందుకు వ్యాక్సిన్‌లపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం సిఫార్సు చేసింది. విదేశాల్లో అనుమతి పొందిన టీకాలను భారత్‌లో అనుమతించే ముందు.. తొలుత 100మంది లబ్ధిదారులకు ఇచ్చి వాటి భద్రత ఫలితాలపై వారం పాటు పరిశీలిస్తారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోతే వాటిని దేశంలో పూర్తిస్థాయిలో అనుమతులు ఇస్తారు.
మన దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనిలో భాగంగా దేశంలో పది కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ వేశారు. కరోనా వైరస్ గతకొద్ది రోజులుగా విస్తరిస్తుండటంతో వ్యాక్సినేషన్ ను వేగంగా చేపట్టాలని కేంద్రం సూచించింది. అయితే వ్యాక్సిన్ కొరత ఉందని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి సూచించడంతో కేంద్రం విదేశీ టీకాలకు అనుమతులు ఇచ్చేప్రక్రియను చేపట్టింది. వివిధ దేశాల్లో అనుమతి పొందిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించి, కొరతను అధిగమించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విదేశాల్లో అభివృద్ధి చేసిన టీకాలు భారత్‌లో అనుమతి పొందాలంటే ఇక్కడే రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో స్పుత్నిక్-వి, నోవావాక్స్ టీకాల ప్రయోగాలు భారత్‌లో చేపట్టాయి. అందువల్ల ఇవి విదేశాల్లో అనుమతులు పొందినప్పటికీ వాటిని భారత్‌లో వినియోగించడంలో కొంత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో వీటి ప్రయోగాలు, ఫలితాల విశ్లేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొద్దిరోజుల్లోనే ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







