నిరుద్యోగ యువతకు తీపి కబురు...
- April 14, 2021
ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా 24 వేల నుంచి 26 వేల మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకోబోతున్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు వెల్లడించారు. వీరిలో 24 వేల మందిని భారత్ నుంచి…మిగిలిన వారిని విదేశాల నుంచి రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపారు. ముగిసిన ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువ కావడం విశేషం. మార్చినెలాఖరుతో ముగిసిన ఆర్థిక మాసంలో భారత్‌లో 19 వేల మంది కొత్త ఉద్యోగులు, విదేశాల నుంచి 2 వేల మందిని ఇన్ఫోసిస్ రిక్రూట్ చేసుకుంది.
కొత్త అవకాశాలు, ఇతరత్ర కారణాలతో కంపెనీని వీడే ఉద్యోగుల సంఖ్య పెరిగినా…నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కంపెనీలో కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రవీణ్ రావు తెలిపారు. కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా గత ఏడాది తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ జీతాలు పెంచలేదు. కాస్త ఆలస్యంగా మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా జనవరి మాసంలో జీతాల పెంపు ప్రకటించారు. ఉద్యోగుల్లో నైపుణ్యతను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జులై మాసంలో రెండోసారి ఫర్ఫార్మెన్స్ రివ్యూ చేపట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరపు చివరినాటికి ఇన్ఫోసిస్ సంస్థలో 2,59,619 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 40 వేల నియామకాలు చేపట్టనున్నట్లు మరో ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్(TCS) ఇప్పటికే ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ 40 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కాగా టీసీఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య మరో మూడు మాసాల్లో 5 లక్షల మార్క్‌కు చేరుకోనుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







