తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 15, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఆంక్షలను కఠినం చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలో మాస్క్ ను తప్పనిసరి చేశారు.మాస్క్ లేకుండా బయట కనిపిస్తే భారీ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3307 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది.ఇందులో 3,08,396 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కరోనాతో కొత్తగా రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1788కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









