స్పుత్నిక్-వీ టీకా దిగుమతికి కసరత్తు..ధరపై ఆర్డీఐఎఫ్తో డాక్టర్ రెడ్డీస్ చర్చలు
- April 15, 2021
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో అత్యవసర వినియోగం కోసం రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (డీఆర్ఎల్) కసరత్తు చేస్తున్నది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది. అంతా సవ్యంగా జరిగితే జూన్‌లోగా భారత్‌కు ఈ టీకా అందే అవకాశమున్నది. అయితే భారత్ కొనుగోలు చేసే డోసుల సంఖ్య, వాటిని ప్రజలకు పంపిణీ చేసేందుకు స్థానికంగా అందుబాటులో ఉన్న కోల్డ్ చైన్ వ్యవస్థ సామర్థ్యం లాంటి అంశాలపై ఈ టీకా లభ్యత ఆధారపడి ఉంటుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కుదుర్చుకు న్న ఒప్పందం ప్రకారం తమకు దాదాపు 25 కోట్ల స్పుత్నిక్-వీ డోసులు రావచ్చని, ఇవి 12.5 కోట్ల మందికి సరిపోతాయని డీఆర్ఎల్ యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్ (ఏపీఐ), సేవల విభాగం సీఈవో వీ దీపక్ సప్రా బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీకా ధరపై ఆర్డీఐఎఫ్తో చర్చలు జరుపు తున్నామని, అవసరమైతే ఆ సంస్థతో పరస్పర అంగీకారాన్ని కుదుర్చుకుని మరిన్ని డోసులను కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







