'బోర్డర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల!
- April 15, 2021
చెన్నై: సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని తెలుగులోనూ డబ్ అయ్యాయి. అయితే... రామ్ చరణ్ 'బ్రూస్లీ', ప్రభాస్ 'సాహో' చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ చేరువయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీకి 'బోర్డర్' అనే పేరు ఖరారు చేశారు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. సామ్ సి.ఎస్. స్వరాలు అందిస్తున్న 'బోర్డర్'లో రెజీనా కసండ్రా, స్టెఫీ పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే చివరి వారంలో విడుదల చేస్తామని నిర్మాత విజయ్ రాఘవేంద్ర చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







