'విక్రాంత్ రోణ' విడుదల తేదీ ఖరారు
- April 15, 2021
బెంగుళూరు: కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా పాన్ ఇండియా మూవీ 'విక్రాంత్ రోణ' సిద్ధమవుతోంది. సుదీప్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు మేకర్స్.ఈ సినిమా నుంచి ఏప్రిల్ 15న సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా...టీజర్ విడుదలవుతుందని అంతా భావించారు.కానీ మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఆగష్టు 19న 'విక్రాంత్ రోణ' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళంతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో, దాదాపు 50 దేశాల్లో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై సుదీప్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు.బి.అజనీష్ లోక్ నాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.... విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్









