ప్రముఖ నటుడికి గుండెపోటు..
- April 16, 2021
చెన్నై: ప్రముఖ నటుడు వివేక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.దాంతో ఆయనను చెన్నైలోని వడపళని సిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వివేక్‌ను పరిశీలించిన వైద్యులు..కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు సిమ్స్ వైద్యులు తెలిపారు.అలాగే వివేక్‌కు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వివేక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న అభిమానులు.. తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆయనకు ఏమీ కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ఇదిలాఉంటే.. 59 ఏళ్ల వివేక్ గురువారం నాడు కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్ తీసుకున్నారు. అనంతరం క్షేమంగా బయటకు వచ్చిన వివేక్.. కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ‘కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం. టీకా వేసుకోవడం’ ముఖ్యం అని ప్రకటించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని అన్నారు. ‘వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకదా? అని మీరు నన్ను అడుగొచ్చు. అయితే, టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకే కరోనా టీకా తీసుకోండి’ అని వివేక్ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే వివేక్.. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోడాన్ని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.అయితే, ఇంతలోనే ఆయనకు గుండెపోటు రావడం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.
నటుడు వివేక్.. కోలివుడ్లో అనేక సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో విడుదలైన సింగం, యముడు వంటి సినిమాల్లోనూ పోలీసు పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







