రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు మరో ఛాన్స్!

- April 16, 2021 , by Maagulf
రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు మరో ఛాన్స్!

కువైట్ సిటీ: రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం వారి రెసిడెన్సీ స్టేటస్‌ను మార్చుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది.మే 15 లోపు గడువు ముగిసిన రెసిడెన్సీలను పునరుద్ధరించుకోవాలని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.ఈ మేరకు అంతర్గత మంత్రి షేక్ థామెర్ అల్ అలీ కీలక ప్రకటన చేశారు.గడువు ముగిసిన దేశంలో అక్రమంగా ఉంటున్నవారు,రెసిడెన్సీని రెన్యూవ్ చేయని ప్రవాసులు ఈ కొత్త గడువులోపు తమ రెసిడెన్సీ స్టేటస్‌ను మార్చుకోవాలని మంత్రి తెలిపారు.దీనికోసం ఈ నెల 15తో ముగిసిన గడువును నెల రోజులు పొడిగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ గడువులోపు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు, తమ స్టేటస్‌ను మార్చుకోని వారి పట్ల జరిమానాలతో పాటు చట్టబద్దంగా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.అలాంటి వారికి రెసిడెన్సీ పర్మిట్లు రద్దు చేయడం,దేశం నుంచి బహిష్కరించడంతో పాటు ఎప్పటికీ తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా చేయడం లాంటి శిక్షలు ఉంటాయన్నారు.కనుక రెసిడెన్సీ గడువు ముగిసిన ప్రవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి షేక్ థామెర్ అల్ అలీ తెలియజేశారు.   

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com