ఆసియా కప్ లో ఫైనల్ కు చేరిన బంగ్లాదేశ్
- March 02, 2016
ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో ఐదు బంతులు ఉండగానే పాక్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించింది. 19.1 ఓవర్లలో 131 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)రాణించడంతో బంగ్లా మరోసారి సంచలనం సృష్టించింది. దీంతో బంగ్లా ఆసియాకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్లో సమీ చేసిన తప్పిదాల కారణంగా 15 పరుగులు రాబట్టుకున్నారు. చివరి ఓవర్ తొలి బంతికి మహ్మదుల్లా(22) ఫోర్ కొట్టి బంగ్లా ఆకాంక్షను నెరవేర్చాడు. మొర్తాజా(12) కూడా చివరి వరకు నిలిచి లాంఛనాన్ని పూర్తి చేయడంలో సహకరించాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









