చేపనూనెతో జ్ఞాపకశక్తి!
- March 02, 2016
వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోవడం, ఆహారం తీసుకోకపోవడం, మాటలు అర్థం చేసుకోలేకపోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉంటే అల్జీమర్స్ వ్యాధిగా భావించాలి. క్రమబద్ధంగా ఆహారం తీసుకుంటే ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలి, ఆహారపుటలవాట్లు సక్రమంగా ఉంటే అల్జీమర్స్‌తో పోరాడవచ్చునని అంటున్నారు.చెక్ రిపబ్లిక్‌లోని ఫిజియాలజీ సీఏఎస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేశారు. చేప నూనెలో అల్జీమర్స్ వ్యాధి కారక లక్షణాలను నిరోధించే గుణం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల కన్నా చేప నూనెతో చేసి ఆహార పదార్థాలను తినడం వల్ల సత్ఫలితాలు వస్తాయని వెల్లడైంది. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలున్న ఎలుకలకు మూడు వారాల పాటు చేప నూనెతో వండిన ఆహారాన్ని అందజేశారు. ఇటువంటి ఆహారాన్ని తినని ఎలుకలతో పోల్చితే వీటి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు పరిశోధకులు తేల్చారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







