స‌ఖీర్ ప్యాలేస్ మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన బ‌హ్రెయిన్ రాజు

- April 17, 2021 , by Maagulf
స‌ఖీర్ ప్యాలేస్ మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన బ‌హ్రెయిన్ రాజు

బ‌హ్రెయిన్: కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాజ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సఖీర్ ప్యాలెస్ మసీదులో శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ర‌మ‌దాన్ మాసం కావ‌టంలో కోవిడ్ నిబంధ‌న‌ల నుంచి శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తిస్తూ ప‌లు ప్రాంతాల్లో మ‌సీదుల‌ను తెర‌వాల‌ని ఆదేశించిన త‌రువాత ఆయ‌న ఈ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడిన సున్నీ ఎండోమెంట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రషీద్ బిన్ మొహమ్మద్ అల్ హజేరి ప్రార్థ‌నా ప్ర‌బోధాల‌ను రాజుతో పాటు ఇత‌ర ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధల‌తో ఆల‌కించారు. బ‌హ్రెయిన్ ప్ర‌జ‌ల సంర‌క్ష‌ణ‌కు, దేశం స‌ర్వ‌తోముఖావృద్ధి చెందేందుకు త‌మ రాజును ర‌క్షించి, ఆశీర్వ‌దించాల‌ని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను హజేరి ప్రార్ధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com