అబ్షర్ ఇండివిజువల్స్, తవకల్న యాప్‌ల ద్వారా ఈ- డ్రైవింగ్ లైసెన్స్
- April 17, 2021
సౌదీ: సౌదీలోని వాహనదారులు ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ హార్డ్ కాపీలను వెంట తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక నుంచి డిజిటల్‌వర్షన్ లో ఈ- డ్రైవింగ్ లైసెన్స్ సేవలతో ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం అబ్షర్ ఇండివిజువల్స్, తవకల్న అనే రెండు యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రెండు యాప్ ల ద్వారా ఈ-డ్రైవింగ్ లైసెన్స్ ను అధికారులకు చూపించవచ్చు. ఈ యాప్ లలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ల ద్వారా స్కాన్ చేయగానే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇదిలాఉంటే..సౌదీ డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (ఎస్‌డిఎఐఎ) సహకారంతో అభివృద్ధి చేసిన డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డిజిటల్ వెర్షన్‌ను భద్రతా అధికారులు ఆమోదించారని ట్రాఫిక్ విభాగం ప్రతినిధి సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్‌పిఎ) కు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







