'థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ పోస్టర్ విడుదల చేసిన నాగచైతన్య
- April 17, 2021
హైదరాబాద్: అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న 'థ్యాంక్యూ బ్రదర్' రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్న రమేశ్ రాపర్తికి సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపాడు చైతన్య. ఇక ఈ సినిమాకు గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందిస్తుండగా సురేశ్ రఘుతు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. అర్చన, వైవా హర్ష, అనీశ్ కురువిలా, అన్నపూర్ణ, మౌనికా రెడ్డి, ఆదర్శ్, కాదంబరి కిరణ్, సమీర్ ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రధారులు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







