యూఏఈలో భారత్-పాక్ విదేశాంగ మంత్రులు..సంధి సంకేతాలు
- April 18, 2021
అబుధాబి: భారత్- పాక్ మధ్య సంధి ప్రయత్నాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే సంకేతాలకు మద్దతుగా యూఏఈలో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అహ్వానం మేరకు భారత్- పాక్ విదేశాంగ మంత్రులు యూఏఈలో పర్యటించనున్నారు.ఈ పర్యటన కోసం పాక్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఖురేషి ఇప్పటికే యూఏఈకి చేరుకోగా...భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదివారం రోజున యూఏఈకి చేరుకుంటారు. ఈ ఇద్దరు మంత్రులు యూఏఈ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతారు.పొరుగు దేశాలైన భారత్- పాక్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు యూఏఈ మధ్యవర్తిత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికాలో యూఏఈ రాయబారి యూసఫ్ అల్ ఒటైబా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే...ఈ రోజు సమావేశంతో అద్భుతాలను ఆశించలేమని...కాకపోతే సంధి దిశగా తొలి అడుగులుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







