Dh400,000విలువైన డబ్బు, నగల చోరీ కేసులో గ్యాంగ్ అరెస్ట్
- April 18, 2021
యూఏఈ: ఓ ఇంట్లో Dh400,000 విలువైన డబ్బు, నగలు దోచుకున్న కేసులో తొమ్మిది మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు.ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ముందుగా ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేశామని..దీంతో అతని నేర చరిత్ర మొత్తం బయటపడిందని వివరించారు. ఫిర్యాదు చేసిన మహిళ ఇంటితో పాటు గతంలో అతను పలు ఇళ్లలో చరీలకు పాల్పడినట్లు వెల్లడించారు.చోరీలలో తనకు మరో ఎనిమిది మంది సహకరించారని,వారిలో మహిళలు కూడా ఉన్నట్లు విచారణలో నిందుతుడు ఒప్పుకున్నట్లు తెలిపారు.నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.నిందితులు అందర్నీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించామన్నారు.ప్రజలు తమ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని తద్వారా చోరీలను అడ్డుకోగలమని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







