రాజస్థాన్‌లో 15 రోజుల లాక్డౌన్..!
- April 19, 2021
జైపూర్: ఢిల్లీ బాటలోనే ఇప్పుడు రాజస్థాన్‌లో కూడా లాక్డౌన్ విధించారు.ఢిల్లీలో 6 రోజులు లాక్డౌన్ విధిస్తే రాజస్థాన్‌లో 15 రోజులు లాక్డౌన్ అమలు చేయబోతున్నారు. ఇవాళ్టి నుంచి మే 3 వరకూ లాక్డౌన్ అమల్లోకి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త కోవిడ్ నిబంధనలు విడుదల చేసిన రాజస్థాన్ సర్కార్.. లాక్డౌన్ ఉన్నా నిత్యావసరాల దుకాణాలకు మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ అనుమతి ఇచ్చింది. అలాగే కూరగాయల వ్యాపారులకు 7 గంటల వరకూ.. పెట్రోల్ బంక్‌లకు 8 గంటల వరకూ తెరిచి ఉంచేందుకు వీలుంటుంది. అటు, ప్రజారవాణాకు షరతులతో అనుమతులు ఇచ్చినా..... విద్యాసంస్థలు, పరిశ్రమలు మాత్రం పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో నియంత్రణకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పడం లేదని రాజస్థాన్ ప్రభుత్వం చెప్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







