తెలంగాణ: నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోండి - హెచ్చరించిన హైకోర్టు
- April 19, 2021
హైదరాబాద్: తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా కొవిడ్ పరిస్థితులను ప్రభుత్వం అన్ని విధాలుగా పర్యవేక్షిస్తోందని ఏజీ కోర్టు దృష్టి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 'పర్యవేక్షణ కాదు.. చర్యలు ఉండాలి. కరోనాపై ప్రజలకు అన్నీ తెలిశాయి. ప్రభుత్వానికే తెలియాలి. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల్లో రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపలేకపోతోంది. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? కుటుంబమంతా కరోనా బారినపడితే ఏ విధంగా సాయం చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఈనెల 22లోగా అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలి' అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
మూడు రోజులు సరిపోవని, మరింత సమయం కావాలని ఏజీ కోరగా, 'మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగతాది మేము చేస్తాం' అని తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. తాజా విచారణ సందర్భంగా హాజరైన వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస్‌రావులు ఈ నెల 23న జరిగే విచారణకూ కూడా హాజరు కావాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







