కోవిడ్ కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 20, 2021
అమరావతి: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి.ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ ప్రభుత్వం.ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.డిప్యూటీ సీఎం,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఉప సంఘం ఏర్పాటు అయింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ అదిత్యనాథ్ దాస్.కరోనా కట్టడికి పలువురు కీలక అధికారులతో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.కమాండ్ కంట్రోల్ సెంటర్ కు కావలిసిన సలహాలు, సూచనలు చేయనుంది మంత్రి వర్గ ఉప సంఘం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







