17 మంది డొమస్టిక్ కార్మికుల అరెస్ట్
- April 20, 2021
దుబాయ్: తమ యజమాని నుంచి చెప్పాపెట్టకుండ పారిపోయిన 17 మంది డొమస్టిక్ కార్మికులను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు.రమదాన్ మాసంలో నిర్వహించిన తనిఖీల్లో తొలి వారంలోనే ఈ 17 మంది పట్టుడినట్లు దుబాయ్ చొరబాటు నిరోధక విభాగం పోలీసులు వెల్లడించారు.తమ తనిఖీలు ఏడాది పొడగునా ఉంటాయని హెచ్చరించారు.ఎవరైనా డొమస్టిక్ కార్మికులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పారిపోతే సదరు యజమాని వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.ఒప్పందం కుదర్చుకున్న యజమాని దగ్గర పని చేయకుండా పారిపోతున్న డొమస్టిక్ కార్మికులతో సమాజానికి భద్రాతపరమైన చిక్కులు ఏర్పడే సమస్యలు ఉన్నాయని వారు వివరించారు.అసలు యజమానికి దగ్గర్నుంచి పారిపోయే కార్మికులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు వేరే పేరుతో గంటల లెక్కన మరో ఇంట్లో పనికి కుదిరుతున్నారని పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







