వ్యాక్సిన్ తీసుకోని వారిపై మరిన్ని ఆంక్షలకు యూఏఈ యోచన
- April 21, 2021
యూఏఈ: వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు అయి ఉండి..ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం యోచిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారిని కొన్ని కీలక ప్రాంతాలకు అనుమతించొద్దని అలాగే కీలక సర్వీసుల నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉంది.వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్ల వారు కోవిడ్ బారిన పడటంతో ఇతరుల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నది జాతీయ విపత్తులు, నిర్వహణ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉన్నా...తీసుకోకుండా అలక్ష్యం చేయటం సమాజంలో తోటి వారికి ఇబ్బంది కలిగించటమేనని అభిప్రాయపడింది. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారి కదలికలపై ఆంక్షలు విధించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని చూస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







