తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- April 21, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.కరోనాను కట్టడి చేసేందుకు నిన్నటి నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు.ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 6,542 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.67 లక్షలకు చేరింది.ఇందులో 3.19 లక్షల మంది డిశ్చార్జ్ కాగా, 46,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 20 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1876కి చేరింది.రోజు రోజుకు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!







