దుబాయ్‌లో క్లినిక్‌ సహా 7 హెల్త్‌ సెంటర్స్‌ మూసివేత

- March 02, 2016 , by Maagulf
దుబాయ్‌లో క్లినిక్‌ సహా 7 హెల్త్‌ సెంటర్స్‌ మూసివేత

మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ప్రివెన్షన్‌ 7 హెల్త్‌ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. 60 రోజులపాటు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. హెల్త్‌ రెగ్యులేషన్స్‌ని అతిక్రమించినందుకుగాను ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. మెడికల్‌ సెంటర్‌తో కూడిన డెంటల్‌ క్లినిక్‌ అత్యంత చెత్తగా ఉందని ఇన్‌స్పెక్షన్‌లో తేలింది. ఇక్కడ ఫుడ్‌ తుప్పు పట్టిన ఎక్విప్‌మెంట్‌, పాత డెంటల్‌ చైర్‌ మరియు కాలం చెల్లిన మందులు ఇక్కడ గుర్తింపబడ్డాయి. ఆహార పదార్థాల పక్కనే, ఆసుపత్రి వ్యర్థిల్ని, స్టెరిలైజ్‌డ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ని ఉంచడాన్ని కూడా గుర్తించారు. కొత్త ఎక్విప్‌మెంట్‌ని సమకూర్చుకునేదాకా, నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు, క్లీన్‌నెస్‌ ఏర్పాటు చేసేదాకా ఈ క్లీనిక్‌ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్స్‌ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో మందులు విక్రయిస్తున్న మూడు ఫార్మసీలను కూడా మూసివేశారు. లైసెన్స్‌ లేకుండా నడుపుతున్న గైనకాలజీ క్లినిక్‌ని, ట్రైనీ ఫార్మసిస్ట్‌తో నడుపుతున్న మరో ఫార్మసీని మూసివేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com