'వరుడు కావలెను' పోస్టర్ విడుదల
- April 21, 2021
హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న సినిమా 'వరుడు కావలెను'. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇంతవరకూ వచ్చిన ఈ మూవీ ప్రచార చిత్రాలకు, లిరికల్ వీడియోకు చక్కని ఆదరణ లభించింది. తాజాగా శ్రీరామ నవమిని పురస్కరించుని, సీతారాముల చెంత నాగశౌర్య కూర్చొని ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో నాగశౌర్య సైతం ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగశౌర్య నటించిన 'లక్ష్య' మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, 'వరుడు కావలెను' పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరో రెండు మూడు సినిమాలు సైతం అండర్ ప్రొడక్షన్ లో వివిధ దశల్లో ఉన్నాయి. 'వరుడు కావలెను' సినిమా కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు... వాటిలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







