100 మందిలో 100.10 మేర వ్యాక్సిన్..వ్యాక్సినేషన్లో యూఏఈ రికార్డ్
- April 22, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో యూఏఈ ప్రభుత్వం కొత్త మైలు రాయికి చేరుకుంది. వ్యాక్సినేషన్ రేటు వివరాలను వెల్లడించిన యూఏఈ లక్ష్యంగా నిర్దేశించుకున్న వర్గాల్లో ప్రతి 100 మందిలో 100.10 మేర వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది.గత 24 గంటల్లో 1,11,176 డోసుల వ్యాక్సిన్ అందించినట్లు పరిపాలన విభాగం వెల్లడించింది.దీంతో యూఏఈలో ఇప్పటివరకు 9.9 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించామని వివరించింది.ఇప్పటివరకు 3.9 మిలియన్ల మందికి పూర్తి డోసులు ఇచ్చినట్లు ప్రకటించింది.ఇదిలా ఉంటే ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాని వారిపై కొన్ని ఆంక్షలను అమలు చేసే యోచనలో యూఏఈ ఉంది.వ్యాక్సిన్ తీసుకోని వారికి కొన్ని కీలక ప్రాంతాలు, కొన్ని సర్వీసులకు అనుమతి నిషేధం విధించాలని యోచిస్తోంది.మిలియన్ల మంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ పై ఉన్న అపనమ్మకాన్ని ప్రజలు విడనాడాలని కోరింది. వ్యాక్సిన్ తీసుకోవటంలో ఆలస్యం చేయటం తోటి వారికి హని చేయటమేనని అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత







