దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- November 15, 2025
దుబాయ్: జుమేరా ప్రాంతంలోని తన నివాసంలో తన స్నేహితుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేలిన అరబ్ వ్యక్తికి విధించిన జీవిత ఖైదును దుబాయ్ కోర్టు ఆఫ్ అప్పీల్ సమర్థించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషిని దేశం నుండి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసు 2022 అక్టోబర్ లో నమోదైంది. జుమేరా బీచ్ రెసిడెన్స్ (JBR) ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ హత్య జరిగింది. ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆధారాలను సేకరించారు. అయితే, అనుమానితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుండి అప్పటికే పారిపోయాడు. పోలీసులు అతడి తండ్రిని విచారించారు.
ఇటీవలి తన కొడుకు ప్రవర్తనలో మార్పులు వచ్చినట్టు తెలిపాడు. యూఏఈ నుండి పారిపోతున్న అతన్ని అరెస్టు చేసి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.
దుబాయ్ క్రిమినల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. తరువాత ఈ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







