100 మందిలో 100.10 మేర వ్యాక్సిన్‌..వ్యాక్సినేష‌న్‌లో యూఏఈ రికార్డ్‌

- April 22, 2021 , by Maagulf
100 మందిలో 100.10 మేర వ్యాక్సిన్‌..వ్యాక్సినేష‌న్‌లో యూఏఈ రికార్డ్‌

యూఏఈ: కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో యూఏఈ ప్ర‌భుత్వం కొత్త మైలు రాయికి చేరుకుంది. వ్యాక్సినేష‌న్ రేటు వివ‌రాల‌ను వెల్ల‌డించిన యూఏఈ ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న వ‌ర్గాల్లో ప్ర‌తి 100 మందిలో 100.10 మేర వ్యాక్సిన్ అందించిన‌ట్లు వెల్ల‌డించింది.గ‌త 24 గంట‌ల్లో 1,11,176 డోసుల వ్యాక్సిన్ అందించిన‌ట్లు ప‌రిపాల‌న విభాగం వెల్ల‌డించింది.దీంతో యూఏఈలో ఇప్ప‌టివ‌ర‌కు 9.9 మిలియ‌న్ల మందికి వ్యాక్సిన్ అందించామ‌ని వివ‌రించింది.ఇప్ప‌టివ‌ర‌కు 3.9 మిలియ‌న్ల మందికి పూర్తి డోసులు ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది.ఇదిలా ఉంటే ఇప్ప‌టికీ వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాని వారిపై కొన్ని ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసే యోచ‌న‌లో యూఏఈ ఉంది.వ్యాక్సిన్ తీసుకోని వారికి కొన్ని కీల‌క ప్రాంతాలు, కొన్ని స‌ర్వీసుల‌కు అనుమ‌తి నిషేధం విధించాల‌ని యోచిస్తోంది.మిలియ‌న్ల మంది ఇప్ప‌టికే వ్యాక్సిన్ తీసుకున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ పై ఉన్న అప‌న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌లు విడ‌నాడాల‌ని కోరింది. వ్యాక్సిన్ తీసుకోవ‌టంలో ఆల‌స్యం చేయ‌టం తోటి వారికి హ‌ని చేయ‌ట‌మేన‌ని అభిప్రాయ‌ప‌డింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com