కరోనా రోగులపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు
- April 22, 2021
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న వేళ రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్య నిపుణుల నియామకం, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించే అంశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళగిరి ఏపీఐఐసీ ఆఫీసులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంత్రి వర్గ ఉప సంఘం కొంచెం సేపటి క్రితం సమావేశమైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు చర్చిస్తున్నారు. ఇలా ఉండగా, ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఉప సంఘం ఏర్పాటు చేసింది. హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మెంబర్లుగా ఈ ఉప సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!







