మంగళవారం వరకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన సౌదీ అరేబియా

మంగళవారం వరకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలకు శుక్రవారం నుంచి మంగళవారం వరకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. అసిర్, అల్ బహా, జజాన్, నజ్రాన్, మక్కా మరియు మదీనా ప్రాంతాల్లో సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. జవాఫ్, తబుక్ మరియు నార్తరన్ బోర్డర్స్ ప్రావిన్స్ సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాల్ని చవిచూస్తాయి. క్యాపిటల్ రియాద్, కాసిమ్ అలాగే ఈస్టర్న్ ప్రావిన్స్ అలాగే హయిల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చు. ఇక్కడ వరదలు సంభవించే అవకాశం కూడా వుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాదకర పరిస్థితులు, ప్రాంతాలకు దూరంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.

 

Back to Top