మహిళ హత్యకు నిరసనగా ఆందోళన

మహిళ హత్యకు నిరసనగా ఆందోళన

కువైట్: అల్ ఎరాడా స్క్వేర్ వద్ద పలువురు నిరసనకారులు న్యాయం కోసం ఆందోళన బాట పట్టారు. వివరాల్లోకి వెళితే, ఫరా అక్తర్ అనే మహిళను ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు, ఆమెతో పెళ్ళికి అంగీకరించలేదన్న కారణంగా నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన వెంటనే విడుదల చేసేశారంటూ పలువురు ఆందోళనకారులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక చట్టం ద్వారా ఇలాంటి కేసుల్లో దోషుల్ని శక్షించాల్సి వుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Back to Top