కరోనా కల్లోలం: కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి
- April 26, 2021
తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్ లోనూ కరోనా కేసులున్నాయని.. వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని సూచించారు. .
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు.
కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదాని మీద సుదీర్ఘంగా చర్చించారు. .
రేపటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేలా తాము నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు, అధికారులకు తెలిపాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరాన్ని కంటైన్మెంట్ జోన్ గా నగర పాలక కమిషనర్ ప్రకటించారు.
ఓ వైపు కేసుల నియంత్రణ మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..