4 క్యాబ్ లను జండా ఊపి ప్రారంభించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్
- April 26, 2021
ఈ సర్వీస్ కోవిడ్ బాధితుల కోసం కాదు, ఇతర అత్యవసర, అనారోగ్య సమస్యలున్న వారికోసం
హైదరాబాద్: కోవిడ్ నైట్ కర్ఫ్యూ..రాత్రి 9 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో మెడికల్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకుని రాచకొండ కమిషనరేట్ లో నాలుగు క్యాబ్ లను ఈ రోజు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఎల్బీనగర్ క్యాంప్ లో ప్రారంభించారు.ఈ క్యాబ్స్ వనస్థలిపురం శ్రీనివాస టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ వారు అందుబాటు లో ఉంచారు. ఇవి ఎల్బీ నగర్, వనస్థలిపురం, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం పరిధిలో రాత్రి కర్ఫ్యూ సమయంలో వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని సీనియర్ సిటీజన్స్, గర్భిణులు, అనారోగ్యంతో అత్యవసర వైద్య సాయం అవసరం ఉన్న మహిళలు ఉపయోగించుకోవచ్చునని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. దీని కోసం రాచకొండ కంట్రోల్ నెంబర్ 9490617234కు ఫోన్ చేస్తే సరిపోతుంది. గతములో కూడా ఇలాంటి సౌకర్యాలను రాచకొండ కమిషనరేట్ తరుపున ఏర్పాటు చేసామని సీపీ గుర్తు చేశారు. ఈ సర్వీస్ కోవిడ్ బాధితుల కోసం కాదు అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు, నాన్ కోవిడ్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఈ వాహనాలు ఏర్పాటు చేశాము. ఎమర్జెన్సీ సమయంలో క్యాబ్ సర్వీసునకు సహకరించిన ట్రావెల్స్ ఎం డీ శ్రీనివాస్ రావు కి రాచకొండ కమిషనరేట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు.
ఫ్రీ ఆఫ్ కాస్ట్
మహేంద్ర తరుపున అంబులెన్స్ ని నెరడమేట్ లో ఏర్పాటు చేశామని, ఈ సర్వీస్ మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఆయన గుర్తు చేశారు. గతంలో లాస్ట్ రైడ్ సర్వీస్ పేరుతో కోవిడ్ తో చనిపోయిన వారికి అంబులెన్స్ లు ఉచితంగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ప్లాస్మా కావాలనుకునేవారు మా కంట్రోల్ రూమ్ కి సంప్రదించండి
ప్లాస్మా కోసం కూడా మా కంట్రోల్ రూముకి 9490617234కి ఫోన్ చేయవచ్చునని రాచకొండ సీపీ గుర్తు చేశారు. మే 1st నుండి 18 సంవత్సరాల వాళ్లపై బడిన వారికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యువత అందరూ వ్యాక్సిన్ తీసుకొనే ముందు బ్లడ్ డోనేషన్ చేయాలని, ఎమర్జెన్సీ సమయంలో బ్లడ్ కొరత రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డోనేషన్ చేయాలని ఆయన కోరారు. త్వరలో రాచకొండ కమిషనరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ వారి అద్వర్యం బ్లడ్ డొనేషన్ కాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నాం
రాచకొండ కమిషనరేట్ లో గత సంవత్సరం 1339 పోలీస్ సిబ్బంది కోవిడ్ బారినపడగా. ఈ సారి 300 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు.కోవిడ్ బారిన పడ్డ సిబ్బంది కోలుకునే వరకు డ్రై ఫ్రూట్ ఇవ్వడం, వారి అకౌంట్ లో రూ.5,000/- ఇవ్వడం జరుగుతుందని రాచకొండ సీపీ అన్నారు. ప్రతిసారి జూమ్ ద్వారా వైద్యులు వారి సమస్యలు తెలుసుకోవడం తద్వారా వారికి మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు నాలుగు వాహనాలు ఇస్తున్నామని రానున్న రోజుల్లో కూడా ఇంకా వాహనాలు ఇచ్చి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని శ్రీనివాస్ ట్రావెల్స్ ఎండీ శ్రీనివాస్ రావు అన్నారు. గత సంవత్సరంలో కోవిడ్ సమయంలో సదుపాయాన్ని దాదాపుగా 170 మంది ఉపయోగించుకోవడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!