సినీపరిశ్రమలో మరో విషాదం..
- April 27, 2021
బెంగుళూరు: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ భర్త కుణిగల్ రాము (52) కరోనాతో మరణించారు. గత మూడు రోజులుగా కరోనాతో పోరడుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుముశారు. కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చుకున్న రాము ఏకే 47, లాకప్ డెత్, కలాసిపాళ్యా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు. ఇదిలా ఉంటే.. గతవారం ఆయన కాస్త అనారోగ్యంగా ఉండడంతో.. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ అని తేలీంది. అయితే శుక్రవారం నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. కాగా సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ఇక మాలాశ్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. కేవలం తెలుగులోనే కాకుండా. కన్నడ, తమిళ భాషలలో కూడా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నారు. పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







