తెలంగాణ కరోనా అప్డేట్
- April 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.ఇవాళ ఏకంగా 10వేలు దాటాయి కరోనా కేసులు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి కేసులు. రాష్ట్రంలో కొత్తగా 10,122 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,11,905 లక్షలకు చేరింది. ఇందులో 3,40,590 మంది డిశ్చార్జ్ కాగా, 69,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక రాష్ట్రంలో కొత్తగా కరోనాతో 52 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2094 కి చేరింది.రోజు రోజుకు రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







