ఎలక్ట్రిక్ కార్స్ తొలి చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
- April 27, 2021
బహ్రెయిన్: పకృతి పరిరక్షణకు ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రొత్సహిస్తున్న బహ్రెయిన్...దేశంలో తొలి చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించింది. విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రి వేల్ బిన్ నాజర్ అల్-ముబారక్ తో పాటు విద్యుత్ మరియు నీటి అథారిటీ (EWA) యొక్క CEO షేక్ నవాఫ్ బిన్ ఇబ్రహీం అల్-ఖలీఫా, సార్ లోని ఏట్రియం మాల్ లో మొదటి ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ టెక్నాలజీలో ప్రముఖ కంపెనీగా గుర్తింపు ఉన్న సిమెన్స్ సౌజన్యంతో చార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. భవిష్యత్ గమనంలో ఇది తొలి అడుగు మాత్రమేనని..రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. చార్జింగ్ పాయింట్ కు వచ్చే వాహనాల డేటా, వాహనదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌పై అధ్యయనం చేసి తద్వారా కొత్త స్టేషన్లలో అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







