తెలంగాణకు సరిపడా టీకాలు ఇస్తాం: భారత్ బయోటెక్
- April 27, 2021
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ర్ట ప్రజలకు సరిపడా కొవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొవాగ్జిన్ టీకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ ఎండీతో సమావేశమయ్యాను అని తెలిపారు. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో వీలైనన్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సీఎస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ర్టానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!







