అవసరానికి మించిన ఆక్సిజన్ ఉంది:మంత్రి ఈటల రాజేందర్
- April 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నా.. సీఎం కేసీఆర్ కనీసం సమీక్షలు కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే, ఇవాళ మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారని వెల్లడించారు.సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్‌లతో టీం ఏర్పాటు చేశామని.. మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయిని సీఎం ముందు చూపుతో పలు సూచనలు చేశారని గుర్తుచేశారు.రేమిడిసివిర్ ఇంజెక్షన్స్ కూడా సమకూర్చాలని ముందే సీఎం కేసీఆర్ చెప్పారన్న ఆయన.. ఆక్సిజన్ సమకూర్చుకోవడానికి దేశ చరిత్రలో మొదటి సారిగా సైనిక విమానాలు ఉపయోగించుకోవడం జరిగిందని.. ప్రైవేట్ , ప్రభుత్వ హాస్పిటల్స్ కి అవసరాన్ని బట్టి ఆక్సిజన్ ఇస్తున్నాం...ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.
అయితే, అక్కడక్కడ ఆక్సిజన్ డీలర్స్ కి ఆస్పత్రి యజమాన్యాలకు వివాదాలు ఉన్న దగ్గర కొద్దిగా ఇబ్బంది ఉందన్నారు మంత్రి ఈటల.. 270 ఎంటీల ఆక్సిజన్ అవసరం ఉంటే 400 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అందుబాటులో ఉందన్న ఆయన.. తెలంగాణ మెడికల్ కాలేజి, పెద్ద హాస్పిటల్స్ మొత్తం 22 లిక్విడ్ ఆక్సిజన్ యూనిట్ లు ఉన్నాయని.. పీఎం కేర్ నుంచి ఆక్సిజన్ యూనిట్లు ఇచ్చారని.. గాంధీ , టిమ్స్, ఖమ్మం, భద్రాచలం ,కరీంనగర్ లలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.మరో 12 యూనిట్స్ కేంద్రం ఇస్తామని చెప్పిందన్న ఆయన.. పేషెంట్స్ పెరిగినా అందుకు అనుగుణంగా ఆక్సిజన్ సమకూర్చుకునే ఏర్పాట్లు జరుగుతున్నాయని.. 10 వేల బెడ్స్ కి ఆక్సిజన్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక, దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ హాస్పిటల్ లో 600 ఐసీయూ బెడ్స్ ఉన్నాయని.. గాంధీ లో 400 బెడ్స్, ఎంజీఎంలో 300 బెడ్స్, టిమ్స్‌లో 300 బెడ్స్, నిమ్స్ లో 200, సూర్యాపేటలో 200, నల్గొండ, మహబూబ్ నగర్, మలక్ పెట్ , గోల్కొండ, సరోజిని, చెస్ట్ హాస్పిటల్ అన్ని కలిపి 3 వేలకు పైడా బెడ్స్ ని ఆక్సిజన్ బెడ్స్ గా మార్చామని..వారం రోజుల్లో అందుబాటులోకి వస్తాయని.. ఇందులో వేయి బెడ్స్ కి వెంటిలేటర్ సౌకర్యం ఉందన్నారు.ఇతర రాష్ట్రాల నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరుతున్నారు.వారికి కూడా సౌకర్యాలు అందిస్తామని వెల్లడించిన మంత్రి.. సిబ్బంది అవసరం ఉంటే తీసుకోవాలని సీఎం చెప్పారు.నాచారం లోని ఈఎస్ ఐలో రేపటి నుండి 350 ఆక్సిజన్ బెడ్స్,నిమ్స్‌లో వీఐపీల కోసం 200 బెడ్స్ అందుబాటులోకి వస్తాయన్నారు.వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలు శాశ్వతంగా భర్తీ చేస్తామని ప్రకటించిన ఈటల.. త్వరలోనే ఆరోగ్య శ్రీ, ఆయుస్మాన్ భారత్‌ను కలిపుతాం.. ఇప్పటికే అమలులోకి రావాల్సి ఉండే.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







