లాక్డౌన్ పై క్లారిటీ ఇచ్చిన టి.హోం మంత్రి
- April 28, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో, ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ బుధవారం నాడు లక్డికాపూల్ లోని తన కార్యాలయంలో, హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి గుప్త, డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్,రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ అనిల్ కుమార్ లతో సమీక్ష జరిపారు.లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు డిప్యూటీ సీఎం,హోంమంత్రి మహమూద్ అలీ.లాక్ డౌన్ పెట్టాలా లేదా అన్నది మాత్రం సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

తర్వలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారన్న ఆయన సమీక్ష తర్వాత లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కానీ, లాక్ డౌన్ పెట్టడం సీఎంకు ఇష్టం లేదన్నారు.ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆయన.. లాక్డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.మరణాలు కూడా పెరుగుతున్నాయి.కరోనా కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా కూడా విచ్చలవిడిగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన మహమూద్ అలీ.ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందని..బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం అన్నారు.కాగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇప్పటికే హోంశాఖకు ప్రతిపాదనలు అందగా..త్వరలోనే లాక్డౌన్ పై అధికారిక ప్రకటన వస్తుందనే ప్రచారం సాగుతోంది.ఈ నెల 30 తర్వాత లాక్‌డౌన్‌కు వెళ్తారని సమాచారం అందుతుండగా కేసీఆర్‌దే ఫైనల్ నిర్ణయం అంటున్నారు మహమూద్ అలీ.
తాజా వార్తలు
- గ్రేహౌండ్స్ దళం భవిష్యత్ కార్యాచరణ పై సమీక్షించిన డిజిపి ఆనంద్
- కేరళ సీఎంగా సతీషన్ ఖరారు
- యూపీలో తుఫాన్ బీభత్సం...74 మంది మృతి!
- బంగారం పై కేంద్రం సంచలన నిర్ణయం..!
- ప్రధాని మోదీ పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
- భారతీయులకు కెనడా బంపర్ ఆఫర్..27 రోజుల్లోనే విజిటర్ వీసా!
- ఏపీ పల్లె వాసులకు గుడ్ న్యూస్.. !!
- రాజ్‌కోట్ హైవేపై ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం
- ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం
- చైనాలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు









