తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- April 29, 2021
చెన్నై: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ప్రభుత్వం.. ఇక, మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ అమలుచేయనున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మే 2న కౌంటింగ్ ప్రక్రియతో పాటు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ఇక, తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటల మధ్య కర్ఫ్యూ అమలులో ఉండనుండగా.. ఎలాంటి సడలింపులు ఉండబోవని స్పష్టం చేసింది ప్రభుత్వం.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతించిన విమానాలు మినహా మిగతా ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.ఇక, నాన్ వెజ్ మార్కెట్లు శనివారం మూతపడనుండగా..ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టీఎన్పీఎస్సీ, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేక కార్డులు జారీ చేయనున్నారు.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







