దుబాయ్‌లోని పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనుమతి లేదు
- April 29, 2021
దుబాయ్: పబ్లిక్ పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను అనుమతించబోమని దుబాయ్ అథారిటీస్ స్పష్టం చేశాయి. ప్రమాదాల నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. బైసికిల్ ట్రాక్‌ల మీద విజిటర్స్ నడవడానికి వీల్లేదనీ, సైకిల్ రైడర్లు గంటకు 15 కిలోమీటర్లను మించిన వేగంతో నడపరాదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, గత అక్టోబర్‌లో ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్ రిగ్గా, జుమైరా లేక్స్ టవర్స్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలెవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్‌లపై మాత్రమే ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నారు. కాగా, దుబాయ్ రెసిడెంట్స్, ఈ-స్కూటర్లు ప్రమాదకరంగా మారాయని, యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య
- ఖతార్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సర్వం సిద్ధం..!!
- మహ్బౌలాలో పోలీసుల తనిఖీలు.. 221 మంది అరెస్ట్..!!
- యూఏఈ లాటరీలో ఒకరికి Dh1 లక్ష జాక్‌పాట్..!!
- సౌదీ బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన 1,450 మంది అరెస్ట్..!!
- ఐసీఆర్ఎఫ్ సమ్మర్ డ్రైవ్.. 4500 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ప్రమాదంలో భారతీయుడికి గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు..!!
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు







