దుబాయ్‌లోని పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనుమతి లేదు

- April 29, 2021 , by Maagulf
దుబాయ్‌లోని పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనుమతి లేదు

దుబాయ్: పబ్లిక్ పార్కుల్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను అనుమతించబోమని దుబాయ్ అథారిటీస్ స్పష్టం చేశాయి. ప్రమాదాల నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. బైసికిల్ ట్రాక్‌ల మీద విజిటర్స్ నడవడానికి వీల్లేదనీ, సైకిల్ రైడర్లు గంటకు 15 కిలోమీటర్లను మించిన వేగంతో నడపరాదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, గత అక్టోబర్‌లో ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్ రిగ్గా, జుమైరా లేక్స్ టవర్స్, షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలెవార్డ్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ, 2 డిసెంబర్ స్ట్రీట్‌లపై మాత్రమే ఇ-స్కూటర్లను అనుమతిస్తున్నారు. కాగా, దుబాయ్ రెసిడెంట్స్, ఈ-స్కూటర్లు ప్రమాదకరంగా మారాయని, యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com