శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..

- April 29, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత..

హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక కోటి 36 లక్షలు విలువ చేసే బంగారాన్ని గురువారం   ఉదయం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి బంగారం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం EK-526 విమానం ద్వారా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని తనిఖీ చేశారు.ఈ తనఖీలో ప్రయాణికుడి నుంచి 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు ఒక కోటి 36 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ప్రయాణికుడిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com