రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై ఉక్కుపాదం: ఏపీ డీజీపీ
- April 29, 2021
అమరావతి: రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో కరోనాపై పుకార్లు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించే వారిపై ఉక్కుపాదం పోపుతామని తెలిపారు.రెమ్‌డెసివిర్ నిల్వలు-వినియోగం, ఆక్సిజన్ నిల్వలు-వినియోగం ఫీజుల పేరిట దోపిడీ తదితర అంశాలపై నిరంతర నిఘా పెడుతామని డీజీపీ పేర్కొన్నారు.పోలీసులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్ప్‌మెంట్, డ్రగ్ కంట్రోల్.. మెడికల్, హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామని తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్టు సమాచారం ఉంటే 100కు, 1902కు డయల్ చేయాలని ఆయన సూచించారు.కోవిడ్ రోగుల నుంచి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులపై ఆరా తీస్తున్నామన్నారు.పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశామన్నారు. గ్రీన్ ఛానల్ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమించామని, ఇతర శాఖలతో సమన్వయానికి కొవిడ్ కంట్రోల్ రూంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియామించామని సవాంగ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







